ప్రాముఖ్యత
పెళ్ళిళ్లలో ఆడవాళ్లు ఎక్కువగా పట్టు చీరలు కట్టాలనుకుంటుంటారు. హిందూ సంప్రదాయంలో పట్టు చీరకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. పండగకీ, పెళ్ళికీ తళతళలాడే పట్టు చీరలు ఉండాల్సిందే. ఇప్పుడు కొత్తగా వర్క్ చీరల ఫ్యాషన్ వచ్చింది. సాధారణ జరీనుంచి వెండి జరీ దాకా వర్క్ చేసిన పట్టు, నైలెక్స్ చీరల ధరలు కూడా ఎక్కువే.
ఉతికేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు[1]
పట్టుచీరలను మృదుజలంతో ఉతకాలి. కఠిన జలమైతే నీటిని మృదువు చేయడానికి చిటికెడు బోరాక్స్ లేదా అమ్మోనియం వాడాలి.
నాణ్యమైన తటస్థ సబ్బులు పొడి రూపంలోకాని ద్రవరూపంలో కాని ఉపయోగించాలి. కఠిన జలమైతే లైట్ డిటర్జెంట్లను వినియోగించాలి.
సబ్బులోని మట్టిని తొలగించడానికి పట్టు వస్త్రాలను వేడి నీటిలో రెండు మూడు సార్లు జాడించాలి.
చివరగా చల్లని నీటితో జాడించేటప్పుడు కొన్ని చుక్కల సిట్రిక్ యాసిడ్ లేదా ఎసిటిక్ యాసిడ్ ను ఉపయోగించాలి.
అనుమానపు రంగు కల పట్టు వస్త్రాలు ఉతికే ముందు 1 నుంచి 2 నిముషాలు చిటికెడు సిట్రిక్ యాసిడ్ లేదా ఎసిటిక్ యాసిడ్ కలిపిన చల్లని నీటితో తడపాలి. పట్టు వస్త్రాలు ఉతికిన తరువాత చేతితో సున్నితంగా పిండి తడిని తీయాలి.
పట్టు చీరలను గదిలో నీడ పట్టున వేలాడ దీసి ఆరబెట్టాలి.
తయారీ
పట్టు చీరల తయారీకి మగ్గాలను, మిషనరీ రెండిటిని వినియోగిస్తున్నారు. నాణ్యత కొరకు మగ్గాలపై నేయబడిన వాటికి గిరాకీ అధికంగా కలదు.
పట్టు చీరల రకాలు, వాటిని ఉత్పత్తి చేయు ప్రాంతాలు
పట్టు చీరలు ఇతర వస్త్రాలు అధికంగా తయారు చేయు ప్రాంతాలు
కోసా సిల్క్ - ఛత్తీస్ ఘర్
సంబల్ పూర్, ఇక్కత్, ఖాండువా, బొంకై/సోనెపురి, బెర్హంపురి, మత్త, బాప్టా, టాంటా, - ఒడిషా
తుస్సార్ - బీహార్